రూ. 42 లక్షల ఖరీదైన కారు కొనుగోలు చేసిన 'జితేంద్ర కుమార్'.. మీరు చూసారా..!!
రూ. 42 లక్షల ఖరీదైన కారు కొనుగోలు చేసిన 'జితేంద్ర కుమార్'.. మీరు చూసారా..!!
International aktualisiert 3 Jahre vor

రూ. 42 లక్షల ఖరీదైన కారు కొనుగోలు చేసిన 'జితేంద్ర కుమార్'.. మీరు చూసారా..!!

జీతూ భయ్యాగా పిలువబడే 'జితేంద్ర కుమార్' ది వైరల్ ఫీవర్ (TVF) తో ప్రసిద్ధి చెందిన తరువాత అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క 'పంచాయత్' వెబ్ సిరీస్‌ ద్వారా మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ యొక్క రాబోయే చిత్రం మెజీషియన్‌లో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.

సాధారణంగా కార్లు మరియు బైకులంటే అందరికి ఇష్టమే. కానీ ఆ ఇష్టం కాస్త సెలబ్రెటీలకు మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే సెలబ్రెటీలు ఎప్పటికప్పుడు కొత్త కార్లను మరియు బైకులను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ 'పంచాయత్' వెబ్ సిరీస్‌ నటుడు జితేంద్ర కుమార్ కొత్త మిని కంట్రీమ్యాన్ కారుని కొనుగోలు చేసాడు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

'పంచాయత్' వెబ్ సిరీస్‌ ద్వారా బాగా పాపులర్ అయిన 'జితేంద్ర కుమార్' ఇటీవల మినీ కంపెనీకి చెందిన కంట్రీమ్యాన్ కారు కొనుగోలు చేశారు. జితేంద్ర కుమార్ కొనుగోలు చేసిన ఈ కొత్త కారు ధర రూ. 42 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇతడు 2022 మినీ కంట్రీమ్యాన్ ఎడిషన్ కొనుగోలు చేసినట్లు తెలిసింది.

జితేంద్ర కుమార్ కొనుగోలు చేసిన మినీ కంట్రీమ్యాన్ కారు వైట్ సిల్వర్ కలర్ స్కీమ్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారుని అతడు ముంబైలోని మినీ మరియు బిఎండబ్ల్యు యొక్క డీలర్ షిప్ ఇన్ఫినిటీ కార్స్ ద్వారా డెలివరీ చేసుకున్నాడు.

జీతూ భయ్యాగా పిలువబడే 'జితేంద్ర కుమార్' ది వైరల్ ఫీవర్ (TVF) తో ప్రసిద్ధి చెందిన తరువాత అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క 'పంచాయత్' వెబ్ సిరీస్‌ ద్వారా మరింత పాపులర్ అయ్యారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ యొక్క రాబోయే చిత్రం మెజీషియన్‌లో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.

Image
2
0
0
0
0
0
0
0
0
0 Bemerkungen

Abonnieren Sie unseren E-Mail-Newsletter und erhalten Sie Updates direkt in Ihrem Posteingang.

Follow Us on Facebook